Sunday, 30 November 2008

అశ్రునివాళి


హిమాద్రి నుంచి మహాబ్ధి దాకా
వ(బ)నాల మొదలు ఎడారి వరకు

గగనం భువనం సంద్రం
చోటేదైనా నీకు నివాసం

తుపాకి నాదం విమాన వేగం
జలాంతర్యానం నీ జీవన వేదం

పగలు సూర్యుడే నీకు నేస్తం రాతిరి చంద్రునితో సహవాసం
ఏదీ నిద్రకు ఆహ్వానం అసలెదీ విశ్రాంతికైన సమయం

అనిమీల నేత్రమ్ అలుపు లేని కాయం
అందరికీ అసాధ్యం అనిమిషులదీ లక్షణం

నువ్వు చేత పట్టిన వైరి వినాశక మృత్యు దండం
ఆ ధూర్జటి ఫాల నయనం

ముక్కంటి కోపానికి సర్వం భస్మం
నీ ఆయుధ జ్వాలలో శత్రువు దగ్ధం

ప్రతిదినం నీచే ముష్కర మూకల సంహారం
భారతమాత ఇంటి ముంగిట తారావళితో దీపావళి సంబరం

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ అని రాముని వాక్యం
జన్మభూమి తల్లిని గన్న తల్లని చాటుతోంది నీ సైనిక తత్త్వమ్

కుటుంబానికి నువ్వు దూరం సుఖాలన్నీ నీకు తృణప్రాయం
ఈ దేశమంతా నీకు పరివారం ప్రాణార్పణకైన నీవు సిద్ధం

అతుల్యం నీ స్థైర్యం అమూల్యం నీ త్యాగం
అనుక్షణం ప్రబోధిస్తున్నాయి మాకు కర్తవ్యం

సూర్యకాంతిని మించిన నీ శౌర్యతేజం
మా భవిష్యత్తు చేస్తోంది మహొజ్జ్వలమ్

నీ రక్షణలో దేశామిక శత్రుదుర్భేద్యం
ఆ స్ఫూర్తి తో సాగుతూ మేమూ శ్రమిస్తే అంతా సుభిక్షం

అపుడే చూడగలం మనము బంగారు భారతం
అదే నీ త్యాగానికి మేమివ్వగల ప్రతిఫలం

ఓ భరత మాత ముద్దు బిడ్డా ! సకల జన ఆత్మ బంధువా!
భరత జాతి చేస్తోంది నీకు హృదయైక అశ్రుపూరిత కృతజ్ఞతాభివందనం
చంద్రునికో నూలు పోగులా మా చిరు కానుకగా అందుకో ఈ కవితా కిరీటం

2 comments:

Arky said...

Bravo, Bravo !

Pavan said...

We miss those brave hearts... Jai Hind